పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
సంగారెడ్డి,శోధన న్యూస్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన , పనులు పాఠశాలలు పునః ప్రారంభమయ్యే లోపు పూర్తీ కావాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇ ఇ, పి ఆర్, ఆర్ డబ్ల్యు స్ మండల విద్యాశాఖ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించరారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక వసతులు అవసరమైన పాఠశాలల్లో ప్రారంభంకానీ పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లాకలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్, మైనర్ మరమ్మతులు, టాయిలెట్ మరమ్మతులు, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్ వంటి మౌలిక వసతుల పర్యవేక్షణ పనులు పాఠశాలలు పునః ప్రారంభమయ్యే లోపు పూర్తి చేయాలనీ అన్నారు .పనులు జరిగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో వుండాలని ఆదేశించారు . క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేసి పక్కాగా ప్రతిపాదన రూపొందించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల పనులు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారానే పూర్తి చేయాలన్నారు. పాఠశాల మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏ పాఠశాలలో ఏఏ పనులు చేపట్టాలో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చేపట్టాల్సిన పనుల గురించి కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా అధికారులు , మండలపరిషత్ అధికారులు , ఇంజనీరింగ్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరులు, మండల విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని ఆదేశించారు . మౌలిక వసతులకల్పనతో పాఠశాలల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.