తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఉజ్వల భవిష్యత్తు కు పునాది ఇంటర్ పరీక్షలు–భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

ఉజ్వల భవిష్యత్తు కు పునాది ఇంటర్ పరీక్షలు
-విద్యార్థులు పరీక్షలను నిర్భయంగా రాయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఇంటర్మీడియట్ పరీక్షలు అని, విద్యార్థులు పరీక్షలు నిర్భయంగా రాయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. బుధవారం నుండి ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులకు ఆమె విషెస్ తెలిపారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా వ్రాసేందుకు అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులలో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు భయాన్ని పోగొట్టేందుకు ప్రత్యేకంగా14416 టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలి మానస్ కు కాల్ చేస్తే నిపుణులైన మానసిక వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ సేవలు అందిస్తారని అన్నారు. అలాగే ఏదైనా సలహాలు, సూచనలు కొరకు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన 040-24601010, 040-24655027 నెంబర్లకు కానీ, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన 7997994366, 8919961013, 9441817478 కంట్రోల్ రూమ్ నెంబర్లకు కానీ కాల్ చేసి సమస్యలను, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, అదేవిధంగా విధులు నిర్వహించే సిబ్బంది, ఎవరికి సెల్ ఫోన్లు ,ఎలక్ట్రానిక్ పరికరాలు,తీసుకెళ్లడానికి అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు ఏదేని ఆరోగ్య సమస్య ఏర్పడితే తక్షణమే పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య శిబిరంలో వైద్య సేవలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని, ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతి లేదని ఆమె తెలిపారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా https:tsbiecgg. gov. in వెబ్ సైట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఎలాంటి సంతకాల అవసరం లేదని, నేరుగా అనుమతిస్తారని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *