సింగరేణి హాస్పిటల్ ను సందర్శించిన ఐఎన్ టియుసి నాయకులు
సింగరేణి హాస్పిటల్ ను సందర్శించిన ఐఎన్ టియుసి నాయకులు
- రోగులకు సదుపాయాలతో పాటు వైద్య సేవలు మెరుగుపరచాలి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి హాస్పిటల్ లో దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయనీ వీటి పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య లు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఏరియా హాస్పిటల్ కు సంబంధించి కార్మికుల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఐఎన్ టియుసి బ్రాంచి కమిటీ, పిట్ కమిటీ సభ్యులతో కలిసి హాస్పిటల్ క్యాజువాలిటీ ఫిమేల్ వార్డులను సందర్శించారు. రోగుల యోగక్షేమాలను సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏరియా యాజమాన్యం స్పందించి ఈ క్రింది సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది దీనికై వెంటనే దోమల నివారణకు కాలనీలో ఫాగింగ్ నిర్వహించాలని, పిచ్చి మొక్కలు కటింగ్ చేయాలని, కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు.
ఏరియా హాస్పిటల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్ట్రీషియన్ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి అన్ని ఏసీలు ఫ్యాన్లు లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అండ్ ఎం డిపార్ట్మెంట్ వారు హాస్పటల్ సందర్శించి వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. వైద్య పరీక్షల సాంకేతిక పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. అవసరమైతే కొత్తవి కొనుగోలు చేయాలి (బిపి మిషన్, వెయిట్ మిషన్, ధర్మ మీటర్ లాంటివి), దోమల నివారణకు పిచ్చి మొక్కల కటింగ్ తో పాటు కాలనీలో ఫాగింగ్ నిర్వహించాలన్నారు. రోగులకు చిట్టీలు రాసేవారు యాక్టివ్ గా ఉండేలా చూడాలన్నారు. వైద్యులు , సిబ్బంది ఖాళీలు భర్తీ చేయాలని ,ప్రతి నెల హాస్పిటల్ ను సందర్శిస్తున్న వైద్య నిపుణులు అరకొర కాకుండా పూర్తిస్థాయిలో వచ్చేలా దృష్టి సారించాలని అన్నారు. హాస్పిటల్ ఉద్యోగుల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ,ఏరియా హాస్పిటల్ ఉప ముఖ్య వైద్యాధికారిణి మేరీ కుమారి ని కూడా ఆమె చాంబర్లో కలిసి సమస్యలు వివరించామని, సోమవారం ఏరియా జిఎం ని కూడా కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ షాభూద్దీన్, సంతోష్ చరణ్ , రాము, రామకృష్ణ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.