తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

కార్మికుల  ప్రాణాలతో చెలగాటం సరికాదు

కార్మికుల  ప్రాణాలతో చెలగాటం సరికాదు

-ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి  నీటిని  అందించాలి 

-టిబిజికేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాగెళ్లి 

మణుగూరు, శోధన న్యూస్ : 

కార్మికుల విలువైన ప్రాణాలతో గని అధికారులు చెలగాటమాడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా టిబిజికెయస్ బ్రాంచ్  ఉపాధ్యక్షులు నాగెల్లి అన్నారు. జీఎం  కార్యాలయ  ఫిల్టర్ బెడ్ నుంచి గని కి వచ్చె గోదావరి తాగునీరు గని లో ఉన్న ఆర్వో ప్లాంట్ వద్ద శుద్ది పరచిన అనంతరం అండర్ గ్రౌండ్ లోకి తాగునీటి కోసం పంపవలసి ఉండగా.. ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా పంపడం వల్ల కార్మికుల ప్రాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.. అండర్ గ్రౌండ్ లోకి తాగునీరు అందించడం కోసం వేసిన పైపులు పాతవి కావడం వల్ల వాటి నుంచి చిలుము రావటం ఓ మాదిరి వాసన వస్తుందని కార్మికులు పలు మార్లు గని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం లేదని ఆయన తెలిపారు..కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే సంస్ధ పురోగతి ఉంటుందని దానిని విస్మరించడం సరికాదని తెలిపారు.  కార్మికులకు అందించే తాగునీటి సరఫరా లో అనేక నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని గని అధికారులు విస్మరించి కార్మికుల జీవితాలతో ఆడుకోవడం తగదని అన్నారు.  తాగునీటిలో లెడ్, ఫ్లోరిన్, నైట్రేట్, క్లోరైడ్ వంటి టిడి యస్ లు పరిమిత స్థాయి మించి ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక కాలేయం, జీర్ణకోశ, నరాల బలహీనత గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, టి డి యస్ లు పర్యవేక్షించే నాథుడే గని నందు కరువైనారని ఆరోపించారు.   ఇకనైనా అధికారులు దృష్టి సారించి ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి జరిగే నీటి టిడి యస్ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అండర్ గ్రౌండ్ లో చిలుము రాకుండా ఆర్వో ప్లాంట్ తాగు నీరు అందించాలని దానితో పాటు సర్ఫేస్ నందు పని చేసే కార్మికులకు ఆర్వో ప్లాంట్ ద్వారా శుద్ధి అయిన నీటిని తాగునీరుగా అందించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *