తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ,హక్కులు కాపాడాల్సిన బాధ్యత పాలకులదే 

సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ,హక్కులు కాపాడాల్సిన బాధ్యత పాలకులదే 

  • సెప్టెంబర్ 9 న సింహ గర్జన, చలో హైద్రాబాద్ ను జయప్రదం చేద్దాం

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, శోధన న్యూస్ : 

 గిరిజనుల  సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ,హక్కులు కాపాడాల్సిన బాధ్యత పాలుకులదే అని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ నాయక్, రాష్ట్ర కన్వీనర్ మాలోత్ సైదా నాయక్ , రాష్ట్ర కో కన్వీనర్ బాణావత్ హుస్సేన్ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ నాయక్, రాష్ట్ర కన్వీనర్ మాలోత్ సైదా నాయక్ , రాష్ట్ర కో కన్వీనర్ బాణావత్ హుస్సేన్ నాయక్ హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 9 న సింహ గర్జన -చలో హైద్రాబాద్ ను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు.  గిరిజనుల   సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ,హక్కులు కాపాడాల్సిన  పాలుకులు..గిరిజనులను  కేవలం ఓట్ల కొరకు మాత్రమే వాడు కోవడం దురదృష్టకరం అన్నారు. ఒక వైపు ఏజెన్సీ లో వంద శాతం ఉద్యోగాలు కోల్పోయాం అని, ఇంకో వైపు రాజ్యాంగ బద్దంగా వచ్చిన పది శాతం రిజర్వేషన్ మీద కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు.

సుప్రీం కోర్ట్ కేవలం ఎస్సి, ఎస్టి  వర్గీకరణ తో పాటు భారత దేశం ఆర్థికంగా వెనకబడిన అగ్రకుల పేదల డాటా వెల్లడిస్తూ అందులో కూడా వర్గీకరణ చేయాలనీ సుమోటో గ తీసుకొని ఆదేశాలు ఇవ్వాలన్నారు. 2020 లో నే 50 శాతం దాటి ఈ డబ్ల్యూఎస్  10 శాతం ఇచ్చి 60 శాతం పెరిగిందన్నారు. గిరిజనులకు ఇచ్చిన 10 శాతం తో కొత్తగా పెరిగింది కాదు కదా అని ఆవేదన వ్యక్తం చేసారు.   ఇంద్రసహాని మండలి కమిషన్ తీర్పు లో పారా 55 లో కూడా సుప్రీం కోర్ట్ ధర్మాసనం పేర్కొన్న విషయం కూడా మర్చిపోవద్దన్నారు. సెప్టెంబర్ 9,సింహ గర్జన ను హైద్రాబాద్ లో నిర్వహించి కుట్రలను పటా పంచలు చేసి ఎండగట్టడం కొరకు స్వచ్చందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సేన రాష్ట్ర కో కన్వీనర్ బానోత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా నాయకులు బర్మా గారి నాయక్, శివా నాయక్ లచ్చు నాయక్, విష్ణు నాయక్, కాన్షిరాం నాయక్, చందర్ నాయక్, ఫుల్ సింగ్ నాయక్, భరత్ నాయక్, బాబు నాయక్, కృష్ణా నాయక్, రాందాస్ నాయక్, ఫుల్ సింగ్ నాయక్, రాజా నాయక్, బట్టు హుస్సేన్ నాయక్, మంగుతు, సేవాలాల్ చందు, మహారాజ్, మహిళా నాయకురాలు రుక్మిణి భాయ్, ఘంసి బాయ్ ,విద్యార్థి సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, మేధావులు, విద్యావంతులు, వివిధ మండల నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *