ఉద్యోగ క్రీడాకారులు క్రీడా రంగంలోనూ రాణించాలి -మణుగూరు బీటిపిఎస్ సీఈ బిచ్చన్న
ఉద్యోగ క్రీడాకారులు క్రీడా రంగంలోనూ రాణించాలి
-మణుగూరు బీటిపిఎస్ సీఈ బిచ్చన్న
మణుగూరు, శోధన న్యూస్ : క్రీడా రంగంలోనూ బీటిపిఎస్ ఉద్యోగ క్రీడాకారులు రాణించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ బి బిచ్చన్న అన్నారు. గత మూడు రోజులుగా పాల్వంచ కేటిపిఎస్ ఐదు, ఆరు పేజీల వారి ఆధ్వర్యంలో జరిగిన టిఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ బాస్కెట్బాల్, హాకీ టోర్నమెంట్లో లో మణుగూరు బీటిపిఎస్ ఉద్యోగ క్రీడాకారులు అత్యత్తమ ప్రతిభ కనబర్చారు. బాస్కెట్బాల్, హాకీలలో తృతీయ స్థానాల్లో గెలుపొందారు. శుక్రవారం ఉద్యోగ క్రీడాకారులు బీటిపిఎస్ సీఇ బిచ్చన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఈ బిచ్చన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ను టిఎస్ జెన్కో ఉత్పత్తి చేస్తూ.. అగ్రభాగాన నిలిచిందన్నారు. సంస్థ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. అన్ని హంగులతో క్రీడా, కళా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ… సంస్థ అభివృద్ధికి పాటు పడడంతో పాటు క్రీడా, సాంసృ్కతిక, కళా రంగాల్లో ఉద్యోగ క్రీడాకారులు, కళాకారులు రాణిస్తూ బీటిపిఎస్ కీర్తిని పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్యదర్శి కల్తీ నరసింహరావు, జట్టు మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు, సభ్యులు డి రమే ష్, ఎం నాగేశ్వరరావు, ఆర్ మురళీ, డి సురేష్, డి వెంకటేశ్వర్లు, టి గోపి, బీ ఉదయ్కుమార్, బి రవితేజ, ఎండి ఖయ్యూం, జీ నవీన్ రెడ్డి, జి సంపత్, పి ప్రవీణ్, కె మధు, పి రవి, పి భరత్, జీ సతీష్ రెడ్డి, జీ వెంకటేశ్వర్లు, ఎం రాము, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.