కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి
కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రైతు వేదిక ప్రాంగణంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపడుచులకు మంజూరైన కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు 40లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం ఎంపీపీ ముత్తినేని సుజాత , జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి షరీఫుద్దీన్ , మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్ , ఎంపీటీసీ కమటం నరేష్, ప్రజాప్రతినిధులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.