ఎమ్మెల్యే కు కమలాపురం గ్రామస్తుల వినతి
ఎమ్మెల్యే పాయంకు కమలాపురం గ్రామస్తుల వినతి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతమైన కమలాపురం గ్రామ ప్రజలు వరద ప్రభావిత సమస్య నుండి కాపాడాలని కోరుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని సమస్యల పై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గోదావరి వరద వల్ల భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్రమైన సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికీ ప్రభుత్వం తరుపున ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.