రేవంత్ రెడ్డిని సన్మానించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం
రేవంత్ రెడ్డిని సన్మానించిన కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘం
హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో అర్ బి వి అర్ అర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత కొన్నేళ్ళ తమ పోరాటాన్ని గుర్తించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద రెడ్డి కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి ఈ కార్పొరేషన్ దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెడ్డి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కోరారు. రెడ్డి విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న బిఇడీ కాలేజీ బాలికల వసతి గృహం అసంపూర్తిగా ఉందని, దాని నిర్మాణం పూర్తి చేయడానికి 2 కోట్ల రూపాయల నిధులు కేటయించాలని విన్నవించారు.దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పదించారని సంఘం నేతలు తెలిపారు.