తెలంగాణవరంగల్

ఎన్నికలకు ఖర్చు పెట్టే లెక్కలపై నిఘా ఉంచాలి 

ఎన్నికలకు ఖర్చు పెట్టే లెక్కలపై నిఘా ఉంచాలి 

-హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

వరంగల్, శోధన న్యూస్  : జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు నాయకులు ఖర్చు పెట్టే లెక్కలపై నిఘా ఉంచాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో గత నాలుగు నెలలుగా స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల వివరాలు, బ్యాంకుల ద్వారా జరిగిన నగదు లావాదేవీలు, ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను సంబంధిత శాఖలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా మద్యం దుకాణాలకు ఎంత మద్యం కేటాయించబడుతుంది, ఈ ఎన్నికల సమయంలో ఎంత తీసుకుంటున్నారనే వివరాలను డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనుమానాస్పద నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని, ఏక మొత్తంగా జరిగిన ఫోన్ పే,గూగుల్ పే ఖాతాలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణను అధికారులు, సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిబంధన మేరకు అన్ని రకాలుగా విచారణ చేసి నగదు, ఇతర వస్తువుల జప్తు చేసి సంబంధిత అధికారులకు నివేదికను సమర్పించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఆర్ఓ వైవి గణేష్, ట్రైనీ ఐపిఎస్ శుభం నాగారలే, హనుమకొండ, పరకాల ఆర్డివోలు వెంకటేష్, నారాయణ, డీఆర్డీవో నాగ పద్మజ, జిల్లా ఖజానా శాఖ డిడి రాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, హనుమకొండ,కాజీపేట, పరకాల ఏసీపీలు దేవేందర్ రెడ్డి, తిరుమల్, కిషోర్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *