తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

  కొణిజేటి రోశయ్య  సేవలు చిరస్మరణీయం 

  కొణిజేటి రోశయ్య  సేవలు చిరస్మరణీయం 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  కొణిజేటి రోశయ్య అందించిన  సేవలు చిరస్మరణీయం అని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ  కొణిజేటి రోశయ్య నాల్గవ వర్ధంతి సభను ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్   రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆచరణలో సాధారణత, పరిపాలనలో ప్రతిభ ఆయన ప్రత్యేకతని కొనియాడారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు కోసం కొణిజేటి రోశయ్య ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *