కార్మిక చట్టాల పునరుద్ధరణకై బిజెపిని ఓడిద్దాం
కార్మిక చట్టాల పునరుద్ధరణకై బిజెపిని ఓడిద్దాం
చికాగో అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ స్వేచ్ఛ జీవితం
-సిపిఐ మండలం కార్యదర్శి అనంతనేని సురేష్
అశ్వాపురం, శోధన న్యూస్: కార్మిక చట్టాల పునరుద్ధరణకై బిజెపిని ఓడిద్దాం అని సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్ అన్నారు . అశ్వాపురం మండలం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అశ్వాపురం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్, గొల్లగూడెం, చింతిరియాల, అశ్వాపురం ఆటో అడ్డ, మొండికుంట లో, మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్ మాట్లాడుతూ.. అమెరికా నగరం హే మార్కెట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదారులు,వారి గుండాలు,పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తంతో తడిసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే అని అన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజాసౌమ్య పాలన అంతమైందని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అనుకూలంగా నాలుగు కోడ్ లను తెచ్చిందని అన్నారు, పెన్షన్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.హమాలి,ఆటో,ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తేవాలని,భవన నిర్మాణ కార్మికుల మరణానికి 10 లక్షల చెల్లించాలని ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని, ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లను పర్మనెంట్ చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగుల సిసిఎస్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి,ఆశ, మధ్యాహ్నం, భోజనం కార్మికులకు 26,000 కనీస వేతనం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని బ్యాంకులను కుదించారదని, గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని సవరించి పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని,అన్ని రకాల కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,ఉపాధి హామీ కార్మికులకు 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, మేలపుర సురేందర్ రెడ్డి, ఏఐటీయూసీ అశ్వాపురం మండలం అధ్యక్షులు, రాయపూడి రాజేష్, అశ్వాపురం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శులు, మల్లబోయిన లింగయ్య, లంకెల లింగరాజు, ఈనపల్లి పవన్ సాయి, ముద్దుశెట్టి, నరసింహారావు,కొల్లిపాక నరసింహారావు, తోట వెంకట నరసయ్య, అక్కినపల్లి నాగేంద్రబాబు, రెడ్డి బోయిన వెంకన్న, దావా రమేష్, దావా వెంకటేశ్వర్లు, కొండా కృష్ణ, మోతుకూరు బాబురావు,మాదా వీరన్న, అంజి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.