చేయి చేయి కలుపుదాం.. గంజాయిని నిర్మూలిద్దాం.
చేయి చేయి కలుపుదాం.. గంజాయిని నిర్మూలిద్దాం..
- కరకగూడెం ఎస్సై రాజేందర్
కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచన మేరకు కరకగూడెం మండలం పరిధిలోని బస్టాండ్ ఆవరణతో పాటు పలు బహిరంగ ప్రదేశాలలో చేయిచేయి కలుపుదాం గంజాయిని నిర్మూలిద్దామని కరకగూడెం పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు, గోడ పత్రికలను అంటించారు. అనంతరం ఎస్సై రాజేందర్ మాట్లాడుతూ యువత గంజాయికి బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి సేవించినా. రవాణా చేసిన కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తు న్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యం గా ఉంచుతామని తెలిపారు.గంజాయిని నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పె రాజేందర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.