లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్దులకు సన్మానం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్దులకు సన్మానం
అశ్వాపురం, శోధన న్యూస్ : ఇటీవల విడుదలైన పది, ఇంటర్, సిబిఎస్ సి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ఆధ్వర్యంలో, అప్ కమింగ్ ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ సహకారం తో గురువారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమం లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంద మందికి భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ హరిబాబు, మణుగూరు అధ్యక్షులు గాజుల పూర్ణ చందర్ రావు మాట్లాడు తూ విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకో ని మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అని, విద్య తో పాటు సమాజ అవగాహనా చేసుకోవాలని తల్లి తండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. సత్యప్రకాష్ మాట్లాడుతూ పై చదువుల కోసం విద్యార్థులకు ఆర్ధికంగా సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో క్లబ్ కార్యదర్శి మీరా, ఎలక్ట్ ప్రెసిడెంట్ సత్య ప్రకాష్, నాగేశ్వరావు, ఎలక్ట్ జోనల్ ఛైర్మన్ తార ప్రసాద్, విద్యార్థుల తల్లి తండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.