లయన్స్ క్లబ్ ఆర్ధిక సహాయం
లయన్స్ క్లబ్ ఆర్ధిక సహాయం
మణుగూరు, శోధన న్యూస్ : గత 10 రోజుల క్రితం పత్రికా విలేఖరి అయిన మందపాటి జగన్నాదరాజు ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ లో వైద్యం పొందుతు తుది శ్వాస విడిచారు. బుధవారం జగన్నాధరాజు దశ దిన ఖర్మల సందర్బంగా లయన్ దండా రాధాకృష్ణ ఆర్ధిక సహాయం తో వారి కుటుంబానికి మణుగూరు లోని వివిధ పత్రికా విలేఖరుల సమక్షంలో 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రెసిడెంట్ గాజుల పూర్ణ చందర్ రావు, దాత, దండా రాధాకృష్ణ, ముత్తం శెట్టి నాగేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.