ఏఐటియుసి ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి
ఏఐటియుసి ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని ఐటిసి బిపిఎల్ శ్రీ సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ లో ఈనెల 23వ తేదీన జరిగే ఏఐటియుసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మణుగూరు సిపిఐ పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు,ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడిఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బి అయోధ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. మహాసభలో ఈ రాష్ట్రంలో దేశంలో ,కార్మిక వర్గం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబడుతుందని అన్నారు. కావున పినపాక నియోజకవర్గం నుంచి ఏఐటీయూసీ నాయకులు ప్రజా సంఘాలు బాధ్యులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై మహాసభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మణుగూరు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రాంనర్సయ్య, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాయల భిక్షం, జి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఆదె ర్ల సురేందర్, ఆర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.