తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవితని గెలిపించాలి
తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవితని గెలిపించాలి
– మణుగూరు జడ్పిటిసి పోషo నరసింహరావు
మణుగూరు, శోధన న్యూస్ : పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపించాలంటే మాలోత్ కవితని గెలిపించాలని మణుగూరు జడ్పిటిసి పోషo నరసింహరావు అన్నారు. ఎన్నిక ప్రచారం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారం, సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రo అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో మన అభ్యర్థిలు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి కాంగ్రెస్కి ఓటు వేస్తే అభివృద్ధి శూన్యమని తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడుతుందని అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతులు, మంచినీటి సమస్యలతో మరియు సరైన టైంలో వికలాంగులకు, వృద్ధులకు వితంతువులకు మరియు ఒంటరి మహిళలకు పింఛన్లు వెయ్యక పోవడంతో వాటిపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, కేసీఆర్ తోనే రైతులకి న్యాయం జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు సీట్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారని అన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో గుట్టమల్లారం మాజీ సర్పంచ్ కారం ముత్తయ్య, ఎనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు వల్లభనేని రమణ,కొండ్రు మల్లేష్, మేకల రవి, మండల కో ఆప్షన్స్ జావిద్, మండల ప్రధాన కార్యదర్శి రామిడి రాoరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామసహాయం వెంకటరెడ్డి, మండల నాయకులు మడి వీరన్నబాబు కంభంపాటి శ్రీను,బుద్దుల ప్రసాద్ పాల్గొన్నారు.