పినపాక ఎమ్మెల్యే పాయం ని పరామర్శించిన మందడి సంజీవరావు
పినపాక ఎమ్మెల్యే పాయం ని పరామర్శించిన మందడి సంజీవరావు
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృమూర్తి
పాయం రాములమ్మ మరణించడం తో జాతీయ వినియోగదారుల అండ్ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు మందడి సంజీవరావు స్వగృహానికి వెళ్లి ఎమ్మెల్యే పాయం ని పరామర్శించారు. రాములమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాలలర్పించారు. రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల అండ్ మానవ హక్కుల పరిరక్షణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బల్ల సందీప్, కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు పీర్నాకి నవీన్ తదితరులు పాల్గొన్నారు.