మణుగూరు మున్సిపాలిటీ రద్దు చేసి గ్రామపంచాయతీలుగా మార్చాలి
మణుగూరు మున్సిపాలిటీ రద్దు చేసి గ్రామపంచాయతీలుగా మార్చాలి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ రద్దు చేసి గ్రామపంచాయతీలుగా మార్చాలని కోరుతూ మంగళవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి స్థానిక క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీ కుమారి ,ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ లు మాట్లాడుతూ.. మణుగూరు మున్సిపాలిటీలో ఎక్కువగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ, పేద ప్రజలు గ్రామీణ కూలీలు నివాసం ఉంటున్నారన్నారు. 2005 సంవత్సరంలో గ్రామపంచాయతీని రద్దుచేసి, మణుగూరు మున్సిపాలిటీగా చేశారని, ఆనాటి నుండి పాలకమండలి లేకపోవడం వలన మొత్తం మున్సిపల్ అధికారులే పెత్తనంతో గ్రామాల్లో అభివృద్ధి చెందడం లేదన్నారు. ఇంటి పన్నులు అధిక మొత్తం తీసుకుంటున్నారని. అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. గ్రామాల్లో ఎక్కువగా పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు జీవనం సాగిస్తున్నారని, పట్టణంలోని గ్రామాలలో ప్రజలకు ఉపాధి పనులు లేకపోవడంతో వందరోజుల పని లేక పేద ప్రజలు సుమారు 50 కిలోమీటర్ల దూరం వలసవెళ్లి, కూలి పనులు చేసుకుంటున్నారని తెలిపారు. వీరికి ఉపాధి హామీ పనులు కావాలన్నా ,మణుగూరు లోని గ్రామాల అభివృద్ధి జరగాలన్న మణుగూరు మున్సిపాలిటీ రద్దుచేసి, గ్రామపంచాయతీలుగా మార్చితే ,గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి పాలక మండల ఏర్పడి గ్రామాభివృద్ధి జరుగుతుందని, దీనికోసం మీరు ప్రభుత్వంతో మాట్లాడి మున్సిపాలిటీ పంచాయతీగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
సమితి సింగారంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి రైల్వే గేట్ వరకు సైడ్ నిర్మాణం చేపట్టాలని, సమితి సింగారంలో డివైడర్ ఏర్పాటుచేసి ,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేసి,వీధి దీపాలు వెయ్యాలని, రేగుల గండి చెరువు నీరు మద్దులగూడెం ,సీతానగరం ప్రజలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎస్కే సర్వర్, గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే కుటుంబరావు, ఏఐటీయూసీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాయల బిక్షం, జి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా నాయకులు మంగి వీరయ్య,, కార్యవర్గ సభ్యులు తోట రమేష్ ,మంద కోటేశ్వరరావు, కన్నెబోయినప్రసాద్, కొత్తపల్లి సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.