తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సికిల్ సెల్ అనీమియా శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలి 

సికిల్ సెల్ అనీమియా శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలి 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : సికిల్ సెల్ అనీమియా వ్యాధిని శాశ్వతంగా నివారణకు చర్యలు చేపట్టాలని మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ జయ అన్నారు. వ్యాధి నివారణ కోసం ఈనెల 19 నుండి జులై మూడో తారీకు వరకు ట్రైబల్ ఏరియా లోని గిరిజనులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి తప్పనిసరిగా స్కీనింగ్ టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే తప్పనిసరిగా సరి అయిన చికిత్సలు అందించాలని ఆమె తెలిపారు.  సోమవారం   న్యూఢిల్లీ నుండి జిల్లా కలెక్టర్లకు,ఐటీడీఏ పీవో లకు సికిల్ సెల్ అనీమియా వ్యాధి గిరిజన గ్రామాలలో ఆదివాసి గిరిజనులకు శోకకుండా తీసుకోవలసిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు.

ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి అనేది ఒక సమూహం అని, హిమోగ్లోబిన్ శరీరంలోని వివిధ కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో బాధ్యత వహిస్తుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా గిరిజన గ్రామాలలోని గర్భిణీ స్త్రీలు,  గిరిజన పిల్లల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినదని గిరిజన ఏరియాలోని గిరిజనులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా సికిల్ సెల్ అనిమయ వ్యాధిని పారదొలడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలలోని హాబిటేషన్స్ లలోని గిరిజన ప్రజలకు, పాఠశాలల్లో, పిహెచ్సి లలో, అంగనవాడి సెంటర్లలో, ఈ వ్యాధి గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి తప్పనిసరిగా సున్నా నుండి మొదలుకొని 40 సంవత్సరాలు ఉన్నవారికి స్కినింగ్ టెస్టులు చేయాలని అన్నారు.

ఈ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా నీటిని పుష్కలంగా తాగాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, హిమోగ్లోబిన్ కు మేలు చేసే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి రోగాలు దరి చేరవని ప్రజలకు తప్పకుండా తెలపాలన్నారు.ప్రతిరోజు గిరిజనులకు క్యాంపులు నిర్వహించి, స్కీనింగ్ టెస్ట్ లకు సంబంధించిన ఫోటోలు, వీడియో గ్రాఫులు దానికి సంబంధించిన రిపోర్టులు తప్పనిసరిగా పంపించాలని, మెడికల్ క్యాంపులు, స్కి నింగ్ టెస్టులకు సంబంధించిన ప్రగతిని అప్పగించిన వైద్య సిబ్బంది తప్పనిసరిగా పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అన్నారు.

అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న 50 ఆశ్రమ పాఠశాలలో, 23 పీఎంహెచ్ హాస్టల్లో,30 వసతి గృహాలలోని గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు మరియు ఆదివాసి గిరిజన గ్రామాలలో సికిల్ సెల్ అని మీయా వ్యాధి నిర్ధారణ వైద్య శాఖ ద్వారా క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సికిల్ సెల్ అనీమియా టెస్టులు నిర్వహిస్తున్నామని, ఈ వ్యాధి గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డి ఆర్ డి ఓ ఎన్ రవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *