భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు.
భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలి
భద్రాచలం, శోధన న్యూస్: సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భద్రాచలానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు జరుగనున్న మిథిలా స్టేడియంలో ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వైభవోపేతంగా ఎక్కడా లేని విధంగా సీతారాముల వారి కళ్యాణం జరిగేటువంటి పవిత్ర స్థలం మన భద్రాచలం పుణ్యక్షేత్రమని అన్నారు. ఈ క్షేత్రంలో కొన్ని దశాబ్దాల తరబడి సీతారాముల వారి కళ్యాణం ఆనవాయితీగా జరుగుతున్నదని తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యేకంగా కానీ పరోక్షంగా వీక్షించిన భక్తులకు ఎంతో పుణ్యం వస్తుందని వేదాల్లో చెప్పడం జరిగిందని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు కళ్యాణ వేడుకలు వీక్షించేందుకు మొత్తం 24 సెక్టార్లు ఏర్పాటు తో పాటు ప్రతి సెక్టార్ లో ఎల్ ఈ డి టివిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేడుకలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం https://bhadradritemple.telangana.gov.inలో అందుబాటులో ఉన్నాయని భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. స్వామి వారి కళ్యాణ వేడుకలు వీక్షించి జన్మ జన్మల పుణ్యాన్ని పొందాలని భక్తులకు ఆయన సూచించారు.