త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు . బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపిడివో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలు మరియు ఆర్డ బ్ల్యుఎస్ ఇంజినీర్లతో తాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జలాశ యాల్లో నీటి లభ్యత తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముందు ముందు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేర నీటి లభ్యత ఉంటుందో, ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ చేయాలన్నారు. బోర్ల మరమ్మత్తులు, ఫ్లషింగ్ లు చేయాలని, ప్రయివేటు బావులు, నీటి వన రులు లీజుకు తీసుకోనుట చేయాలని అన్నారు. నీటి వనరులు ఉన్న గ్రామాల్లో సరిపోను ఉన్నది లేనిది చూడాలన్నారు. త్రాగునీటి సరఫరా విషయమై మంజూరు పనులు యుద్ధప్రా తిపదికన పూర్తి చేయాలన్నారు. బోర్ వెల్ ఆపరేటర్లు అనుమతి లేకుండా ప్రయివేటు బోర్లు వేస్తే వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. క్రొత్త బోర్ల మంజూరు విషయమై నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆమె అన్నారు. గత సంవ త్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాలలో సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మిషన్ భగీరథ ఏఇలు క్షేత్ర స్థాయిలో గ్రామాలు తిరిగి త్రాగునీటి సరఫరాలో ఉత్పన్నమయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సరిచేయా లని అన్నారు. త్రాగునీటి ట్యాంక్ పరిశుభ్రత పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీలదే అని ఆమె తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు. జిల్లాలో 350 ఇంకుడు గుంతలు మంజూరు చేసినప్పటికి ఇప్పటివరకు పూర్తి కాకపోవడం పై అసహనము వ్యక్తం చేసారు. వారం రోజులలో అన్ని పూర్తి చేసి నివేదిక సమర్పించాలి అని ఆమె ఎంపీడీఓ లని ఆదేశించారు.త్రాగునీటి ఎద్దడి కల్గకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ విద్యాచందన, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఇంచార్జ్ డిపిఓ సుధీర్ కుమార్, అన్ని మండలాల మిషన్ భగీరథ డి ఈ లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు మరియు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.