గంజాయి రవాణా, విక్రయాల నిర్మూలనకు చర్యలు తీసుకొవాలి
గంజాయి రవాణా, విక్రయాల నిర్మూలనకు చర్యలు తీసుకొవాలి
ఖమ్మం,శోధన న్యూస్: గంజాయి నియంత్రణపై ఐజీపీ ఏవి రంగనాధ్ పలు జిల్లాల పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్ సరిహద్దు రాష్ట్రాల పోలీస్ అధికారుల సమన్వయం, సమాచార మార్పిడితో గంజాయి అక్రమరవాణా లింక్ లను బ్రేక్ చేయాలని అన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా గంజాయి మూలాలను కనిపెట్టి కట్టడి చేయడంతో పాటు వివిధ మార్గాలలో చేస్తున్న రవాణాపై దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందుతులకు న్యాయస్థానంలో పడిన శిక్షలను పరిగణంలోకి తీసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో 170 కేజీల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో పకడ్బంది చార్జ్ షీట్ తో నలుగురికి ఇరువై ఏళ్ల జైలు శిక్ష,జరిమానా పడేలా చేసిన ఖమ్మం జిల్లా పోలీసులను ఐజీపీ అభినందించారు.