వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
Measures should be taken to prevent water scarcity in summer
వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి మినీ సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంచినీరు సరఫరా, మున్సిపాలిటీలు పంచాయతీల పరిధిలోని గ్రామ ప్రజలకు నీటి కొరకు రాకుండా ముందస్తు ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వేసవిలో జిల్లాలో ఎలాంటి నీటి ఎద్దడి రాకుండా అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు మోటార్ రిపేర్సు, హ్యాండ్ పంప్ రిపేర్ చేయించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామపంచాయతీలలో నీటి పరిశుభ్రత, నీటి సరఫరాపై సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు రోజువారి సమీక్ష జరుపుకోవాలని అన్నారు. రాబోయే ఎండలో కాలం తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉన్నందున భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టనున్నందున అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గత మూడు సంవత్సరాలలో తీవ్ర నీటి ఎద్దడి వున్న గ్రామాలను గుర్తించి వాటి నివారణకు యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. నీటి ఎద్దడి గల ప్రాంతాలలో అవసరమైతే వ్యవసాయ బోర్లను అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవాలన్నారు.
మున్సిపాలిటీలలో, గ్రామపంచాయతీలలో గల మంచినీటి ట్యాంకులను ప్రతినెలా 1,11,21 తేదీలలో విధిగా శుభ్రం చేయాలన్నారు. పారిశుధ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశుభ్రంగా ఉంచాలని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రతి శుక్రవారం డ్రై డేగా పరిశుద్ధతపై దృష్టి సారించి మున్సిపాలిటీలు మరియు గ్రామాలు శుభపరచుకోవాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం జిల్లాలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి విద్యాచందన, జెడ్పిసిఓ ప్రసూన రాణి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ తదితరులు పాల్గొన్నారు.