ప్రతీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ప్రతీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కారాన్ని చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
-ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు :
గుండాల మండలం కాచన పల్లి గ్రామానికి చెందిన కుంజ. వెంకయ్య కాచన పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 55/18 లోగల వ్యవసాయ భూమి తనకు అప్పగించవలనని, జడ్జిమెంట్లు వచ్చాయని దీని విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ గుండాల తహసిల్దారుకు ఎండార్స్ చేశారు.
ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధి తాళ్లపాయి పంచాయతీ బూర్గు కోయ గుంపు గ్రామంలో 17 మంది రైతులకు గత 40 సంవత్సరాల క్రితం ఫైనల్ పట్టాలు ఇచ్చారు. వీటిని సర్వే నెంబరు 300/1/1 గతంలో సర్వే చేసి కొంతమందికి పట్టాలిచ్చారు. మిగతా వారికి సర్వే చేయలేదు. తాజాగా ఇక్కడ శాటిలైట్ సర్వే నిర్వహించగా ఫారెస్ట్ పట్టా అని చూపిస్తుంది. మళ్లీ సర్వే చేసి పట్టాలు మంజూరు చేయాలని పలువురు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీని విషయంలో ములకలపల్లి తహసిల్దార్ కు ఎండార్స్ చేశారు.
షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పరిగణించి వారికి జీతభత్యాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కు పలువురు వినతిపత్రం అందజేశారు. దీని విషయంలో కలెక్టర్ పరిశీలించి జిల్లా పరిపాలన అధికారికి ఎండార్స్ చేశారు.
*చండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రజలు, దుకాణదారులు స్థానిక స్టేట్ బ్యాంకు ముందు నుంచి వెళ్లేందుకు దారి లేకుండా స్థానిక వ్యక్తి అక్రమంగా ఆక్రమణ చేశాడని దీని విషయంలో చర్యలు తీసుకోవాలని పలువురు ఫిర్యాదు చేయగా, విచారణ చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి ఎండార్స్ చేశారు.
బూర్గంపాడు కు చెందిన షేక్ రజబలి. రెవిన్యూ శివారు సర్వేనెంబర్ 196/అ,196/ ఆ, 3-12 గుంటల భూమి ఇనాంగా ఇచ్చినారు. ఈ భూమి విషయంలో తాను గతంలో కౌలుకు ఇవ్వగా ,ఆ భూమి అన్యాక్రాంతమై ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బూర్గంపాడు తాహసిల్దార్ కి ఎండార్స్ చేశారు…
*జూలూరుపాడు గ్రామం నివాసి షేక్ రహీం మున్నీ. వయసు 58 సంవత్సరాలు. భర్తకు గుండె ఆపరేషన్ అయి ఏడు సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందని ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడైనా స్వీపర్ గా పనిచేసే అవకాశం కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
*విద్యానగర్ కాలనీ సర్వేనెంబర్ 161/5 లో గల స్థలం వివాదం కలెక్టర్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా అక్రమంగా ఒకరు షెడ్డు నిర్మించి ఉన్నారని దాని విషయంలో న్యాయం చేయాలని కోటా శివశంకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ పరిశీలించి లీగల్ సెల్ కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, మధు, దామోదర్ రావు,జిల్లా అధికారులందరూపాల్గొన్నారు.