విజయవాడ కు మేదరమెట్ల పాదయాత్ర
విజయవాడ కు మేదరమెట్ల పాదయాత్ర
మణుగూరు, శోధన న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మొక్కు చెల్లించుకునేందుకు టిఎన్ టియుసి రాష్ట్ర కార్యదర్శి మేదరమెట్ల నాగేశ్వరరావు మణుగూరు ఆంజనేయ స్వామి ఆలయం లో పూజలు చేసి విజయవాడ కనకగుడి దుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రను నియోజకవర్గ నాయకులు తుల్లూరి ప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందా మధు, పసునూరి సీతమ్మ, పసునూరి కృష్ణ, పార్లమెంటు అధికార ప్రతినిధి మేదరమెట్ల శ్రీనివాసరావు, ధర్మరాజు శంకర్, మణుగూరు మండల మహిళా నాయకురాలు మడి శాంతమ్మ, వీర రాజు, వీరయ్య, సరిత తదితరులు పాల్గొన్నారు.