తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

వైద్యాధికారులు అనుక్షణం అప్రమత్తతో ఉండాలి

వైద్యాధికారులు అనుక్షణం అప్రమత్తతో ఉండాలి
– వైద్యం కోసం వచ్చే వారికి భరోసా కల్పించండి
– పినపాక  ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, శోధన న్యూస్ : వానకాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యాధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రులకు వచ్చే రోగులకు సేవలందించే విషయంలో నిత్యం అప్రమత్తతో ఉండాలనీ మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ వైధ్యశాలలు భేష్ అనిపించుకునేలా పని చేయాలని ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని  ప్రజా భవన్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ పిహెచ్ సి, సివిల్, 100  పడకల వైద్యశాలల అధికారులతో సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఏజన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులై న టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా డెంగ్యూ, రోగాలు ప్రబలకుండా ఆశ వర్కర్లు, హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పల్లెల్లో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన మందులు తేప్పించుకోవాలని ప్రాణ నష్టాన్ని నివారించాలని సూచించారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోని అళ్లపల్లి, గుండాల మండలాల్లో రోగులను చికిత్సల నిమిత్తం వస్తె మెరుగైన వైద్యం అందించాలన్నారు.  వైద్యులు హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు, పల్లె దవాఖన లని కో- ఆర్డినేషన్ చేసుకుంటూ సిబ్బంది గైర్హాజరును నిరోధిస్తూ వైద్యం అందించడంలో లోపాలు రాకుండా చూసుకోవాలన్నారు.

మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఆల్లపల్లి మండలాల్లోని పిహెచ్సి ల స్థితిగతుల వివరాలతో పాటు ఆస్పత్రిలో ఉన్న ఆర్ ఓ ప్లాంట్, జనరేటర్ సమస్య తో పాటు గదులలో సౌకర్యాలు లేమీ, కావాల్సిన సిబ్బంది ఉన్న సిబ్బంది ఎంత మంది డిప్యూటేషన్ లో ఉన్నవారు, భవనాల్లో తాగు నీటి సమస్యలు, సివిల్ పనులు, కరెంట్ సమస్యలు తదితర వివరాలతో నివేదిక అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.  ఆస్పత్రుల్లో డయాలసిస్ కు వచ్చే రోగుల వివరాలు వారికి అవసరమైన సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు.  20 నుంచి 25 వేల జనాభాకు ఒక పీహెచ్సీ ఉండాలని,  లేని మండలాల్లో మంత్రులతో మాట్లాడి వెంటనే వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. రెవెన్యూ అధికారులకు ఆయా ప్రదేశాల్లో స్థల సేకరణ చేయాలి అని ఆదేశించారు.

108,104, మొబైల్ టీమ్ ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలకు రావాల్సిన గ్రాంట్లు రాకుండా పెండింగ్లో ఉన్నాయని, దానివల్ల నిర్వహణ ఇబ్బందిగా మారిందని కొందరు వైద్యులు ఎంఎల్ఏ పాయం కి తెలుపగా ఎన్ని రోజులుగా రావడం లేదని రాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గ్రాంట్లు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ రాజ్ కుమార్, 100 పడకల ఏరియా ఆసుపత్రి సూపరంటెండెంట్ సునీల్, డాక్టర్ లు శైలేష్, సంకీర్త, మనీష్ రెడ్డి, శృతి, మధు, రేవంత్, శివ పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *