సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మంత్రి పొంగులేటి
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం వెంకట్రావ్ లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలో నియోజకవర్గంలో కష్టపడి పని చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పినపాక , భద్రాచలం నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు. సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.