వైరాలో మంత్రి పొంగులేటి పర్యటన
వైరాలో మంత్రి పొంగులేటి పర్యటన
వైరా ,శోధన న్యూస్: తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైరా నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వైరా మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పణితి సైదులు తల్లి చనిపోయినందున వారి కుటుంబాన్ని, ఫిషరిష్ చైర్మన్ రహీంకు ఆపరేషన్ అయినందున అతన్ని పరామర్శించి ఓదార్చారు. ఏన్కూర్ మండలంలోని కేసుపల్లి గ్రామంలో శెట్టిపల్లి వెంకటేశ్వర్లు సోదరుని కుమారుడు చనిపోయినందున వారి కుటుంబాన్ని, కాలనీ నాచారంలో మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు తండ్రి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. జూలూరుపాడు గ్రామంలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.