సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభాస్థలిని పరిశీలించిన మంత్రి తుమ్మల
సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభాస్థలిని పరిశీలించిన మంత్రి తుమ్మల
మహబూబాబాద్, శోధన న్యూస్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 19న మహబూబాబాద్ పట్టణంలో జరగనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.ఈ క్రమంలో సీఎం పాల్గొనే సభాస్థలిని మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. మంత్రి తుమ్మలతో పాటు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్ సభా ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్,పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,ఆయా మండలాల ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.