తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకి మంత్రి తుమ్మల నివాళి 

పద్మశ్రీ సకిని రామచంద్రయ్యకి మంత్రి తుమ్మల నివాళి 

మణుగూరు, శోధన న్యూస్ :   

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమ్మతి సింగారం గ్రామంలో ప్రముఖ డోలు వాద్య కారుడు పద్మశ్రీ సకిని రామచంద్రయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల  నాగేశ్వర రావు  ఆ గ్రామానికి చేరుకిని సకిని రామచంద్రయ్య  చిత్రపటానికి పూలమాలవేసి, శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు  మాతృవియోగం చెందిన విషయం తెలుసుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సాధువు రమేష్ రెడ్డి , తుపాకుల ఎల్లగొండ స్వామి, ఎండి రసూల్, తుళ్లూరు బ్రహ్మయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *