సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విప్పల సింగారం, చెరువు ముందు సింగారం గ్రామాలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఏడు సిసి రోడ్ల ను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. తొలుతగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి గ్రామస్తుల పూలదండలువేసి హారతి ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పల్నాటి వేఙ్కటేశ్వరరావు, ఐసిడిఎస్ సీడీపీఓ జయలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.