నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ గ్రామంలో డాక్టర్ మాలకొండయ్య నూతన హాస్పిటల్ ను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు శనివారం ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను హాస్పిటల్ యాజమాన్యం శాలువాతో సన్మానించి పూల బొకే అందించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.