మణుగూరు లో స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు లో స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద నూతనంగా మంజూరైన రెండు స్లీపర్ కోచ్ బస్సులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గ ప్రజలు నిత్యం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుండటంతో ప్రజల సౌకర్యార్థం నూతన బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేయడం జరిగిదన్నారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం రెండు నూతన స్లీపర్ క్లాస్ బస్సులను మంజూరు చేసిందని ఆయన తెలిపారు నూతన బస్సులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి , మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు ఆర్టీసీ డిఎం స్వామి, సిఐ కనకదుర్గ , ఎంఎఫ్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.