గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయం
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పాయం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఐలాపురం గ్రామంలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. మొత్తం ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ ఎం ని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని భోజనశాల, విద్యార్థుల వసతి గదులను పరిశీలించి, గదుల్లో ప్యాన్ లు, లైట్ లు పనిచేయకపోవడంతో వెంటనే రిపేర్ చేయించాలని అధికారులు సూచించారు. హాస్టల్ లో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి ఉపాద్యాయులకు సూచించారు.