కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఎల్సిరెడ్డిపల్లి గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికలపాఠశాలను సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, ప్లేట్లు గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని పరిశీలించారు. మొత్తం ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరిపడా నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్ ఎం ని ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని భోజనశాల, విద్యార్థుల వసతి గదులను పరిశీలించి, గదుల్లో ప్యాన్ లు, లైట్ లు పనిచేయకపోవడంతో వెంటనే రిపేర్ చేయించాలని అధికారులు సూచించారు. హాస్టల్ లో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలి ఉపాద్యాయులకు సూచించారు.