ఖమ్మంతెలంగాణ

షిర్డీ సాయిబాబాకు ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

షిర్డీ సాయిబాబాకు ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

ఖమ్మం , శోధన న్యూస్ :  ఖమ్మం గాంధీ చౌక్ లో కొలువైన షిర్డీ సాయిబాబాను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ..  భక్తకోటికి గురుపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు,భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మా గాయత్రి గ్రానైట్స్ కంపెనీ పక్షాన లేదా తన ఎంపీ నిధుల నుంచి సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఇక్కడ జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.   తనతో పాటు భక్తులు,వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా మంచి జరగాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతున్ని వేడుకున్నారు. అనంతరం ఎంపీ రవిచంద్ర కు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయ కమిటీ ఛైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు,పాలక మండలి సభ్యులు ఎంపీ వద్దిరాజుకు సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించి,జ్ఞాపికను బహుకరించారు. ఎంపీ వద్దిరాజు వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,యువ నాయకుడు నానబాల హరీష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *