నల్లగొండ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి -ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
నల్లగొండ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
-ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర, శోధన న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనాన్ని ఎండగట్టి నీటి హక్కులను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఆధ్వర్యంలో నల్లగొండలో ఈ నెల 13న నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కి మద్దతుగా ప్రజలందరూ నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు నీటిపై పూర్తి హక్కు ఉంటే రైతాంగానికి మేలు జరుగుతుందని, కేంద్రానికి నీటి హక్కులు అప్పజెప్పితే నీటి కోసం కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి వస్తాయన్నారు. నీటి హక్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ చేపట్టిన నల్గొండ సభకు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు చావా వేణు, కునా నరేందర్ రెడ్డి, అరిగే శ్రీనివాసరావు, వైవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.