మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే నారీ శక్తి ఫిట్ నెస్ రన్
మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే నారీ శక్తి ఫిట్ నెస్ రన్
– పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు
పినపాక, శోధన న్యూస్ : మహిళల్లో క్రీడా సంస్కృతి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు నారీ శక్తి ఫిట్నెస్ రన్‌ను నిర్వహించినట్లు పినపాక ఎంపీఓ కె వేంకటేశ్వర రావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రం లో నారీ శక్తి ఫిట్నెస్ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వాళ్లకి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం ఎంపీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం, షిల్లాంగ్, నాంగ్స్టోయిన్, నాంగ్పోహ్ , జోవాయి యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నారీ శక్తి ఫిట్నెస్ రన్‌ను పినపాక మండల కేంద్రం లో నిర్వహించామన్నారు. దేశంలో మహిళా శక్తి యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని అప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జ్యోతి, ఐకెపి ధనలక్ష్మి, ఐకెపి సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.