నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం
జిలుగుల లో నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం
-నవగ్రహాల దాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్
హన్మకొండ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలోనీ హనుమాన్ టెంపుల్ లో మూడు రోజులపాటు నవగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు జరుపుకుంటారని హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తంగళ్ళపల్లి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ టెంపుల్ లో నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి నవగ్రహాలను బహుమానం గా తంగళ్ళపల్లి రమేష్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను పుట్టి పెరిగిన ఊరుకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో నేడు గ్రామంలోని హనుమాన్ టెంపుల్ లో టెంపుల్ కమిటీ యొక్క సూచనల మేరకు నవగ్రహాలను బహుమానం ఇవ్వడం జరిగిందని.. ఆ ముక్కోటి భగవంతుల దైవ ఆశీస్సులతో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతానని తెలిపారు ఈ నవగ్రహాల దేవుళ్ళ ఆశీస్సుతో గ్రామంలోని ప్రజలు పాడి పంటలతో , సుఖశాంతులతో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని అభివృద్ధి గా ముందుకు సాగాలని కుటుంబ సమేతంగా హోమ పూజ కార్యక్రమంలో ఆ భగవంతుడునీ వేడుకున్నానము అని , ఆ దైవానుగ్రహ ఆశీస్సులు నాపై ఉండినట్లయితే గ్రామానికి మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని గ్రామానికి నవగ్రహాలను బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి జిలుగుల హనుమాన్ గుడి చైర్మన్ అధ్యక్షులు కత్తిల లింగారావు ఉపాధ్యక్షులు పల్లె రాజయ్య సభ్యులు ముష్కే కుమార స్వామి ఆరెపల్లి సమ్మయ్య తంగళ్ళపల్లి జయ దుగ్యాల లింగారావు సభ్యులు పోతూ లింగారెడ్డి రావుల రాములు గ్రామ సలహాదారులు పెద్దిరాని రావుల ప్రదీప్ రావుల రమేష్ పెద్ది కిషన్ రెడ్డి జోగిరెడ్డి చంద్రయ్య ఆరేపల్లి రాజయ్య మనోహర్రావు గ్రామ ప్రజలు యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.