న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
-పోరాడే వానిదే ఎర్రజెండా: జక్కం కొండలరావు
మణుగూరు, శోధన న్యూస్ : పోరాడేవానిదే ఎర్రజెండా అని శ్రమజీవుల ఐక్యతకై పాటు పడడమే కాకుండా చెమట చుక్క శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘన చరిత్ర విప్లవ పార్టీలదని అరుణోదయ కళాకారుడు జక్కం కొండలరావు అన్నారు. లెనిన్ 154వ జయంతిని పురస్కరించుకుని మణుగూరు ఐ ఎఫ్ టి యు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 154వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా వాడవాడలా ఎర్రజెండా రెపరెపలాడాలని అన్నారు, దున్నేవాడికే భూమి కావాలని పీడిత తాడిత ప్రజా సమస్యల విముక్తి కోసం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిరంతరం ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా ఆయన బృందం పాటలు పాడుతూ అమరులకు నివాళులు అర్పించారు.