అగ్రిటెక్ శాఖ ప్రారంభం
కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం
-అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి
-కోపరేటివ్ డైరెక్టర్ రావుల కనకయ్య గౌడ్,నిర్వాహకులు బొంగోని గణేష్ గౌడ్
కరకగూడెం, శోధన న్యూస్ : అధునాతన పరికరాలతో సాగుచేస్తే రైతులు లాభాలు గడించవచ్చని పీఏసీఎస్ సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మన అగ్రోటిక్ శాఖను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నూతన పద్ధతులు అవలంభించి వ్యవసాయం సాగు చేయాలన్నారు.అగ్రోటిక్ యంత్రాలు, పరికరాలను వినియోం గించుకోవాలని కోరారు.అగ్రోటిక్ శాఖలో తైవాన్ స్ప్రేయర్, బ్యాటరీ స్పేయర్, ఫవార్ వీడర్, టార్పలిన్స్, మోటార్స్ పరికరాలున్నాయి. అంతేకాకుండా తక్కువ ధరకు ఇవి లభించడమే కాకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొంగోని గణేష్ గౌడ్, పలు పార్టీల నాయకులు,రైతులు,నిర్వాహక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.