తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మన దేశం కోసమే మన దేహం 

మన దేశం కోసమే మన దేహం 

-డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మన దేశం కోసమే మన దేహం ఉందని, -గ్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, బాల బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, దివ్యాంగులు తో చేపట్టిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో డ్రగ్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో  ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లా అతిపెద్ద జిల్లా అని, ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వ్రయోవృద్ధులు, యువత ఇంత ఎండలో ర్యాలీలో పాల్గొనడం స్ఫూర్తి కలిగించిందని తెలిపారు. యువత దివ్యాంగులను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి, డ్రగ్స్ సోల్జర్స్ గా మారాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పట్టణాలు, మండలాల్లోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు వారం రోజుల పాటు విస్తృత స్థాయి లో అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన దేహం ఉన్నది మన దేశం కోసమని మాదకద్రవ్యాలు సేవించి దేహాన్ని పాడు చేసుకోవద్దని కోరారు.

అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా అరికట్టడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అగ్రస్థానంలో ఉందని తెలిపారు.ఎవరైనా మాదకద్రవ్యాలు అక్రమ రవాణా లేదా సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీని విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రెహమాన్, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య,జిల్లా సంక్షేమ అధికారి విజేత, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ స్వామి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, జిల్లా అధికారులు,పోలీస్ సిబ్బంది, దివ్యాంగులు, వయోవృతులు, ట్రాన్స్ జెండర్స్, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *