తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి 

పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి 

మణుగూరు, శోధన న్యూస్ : పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని  ఆ  సంఘం గౌరవ అధ్యక్షులు  బేతంచర్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల కేంద్రంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ పినపాక నియోజకవర్గం  ఏడు మండలాల అభిమానులు తో వేణు రెస్టారెంట్ ఫంక్షన్ హాల్ లో  పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రత్యేక సమావేశం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  గౌరవ అధ్యక్షులు  బేతంచర్ల వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు.  భవిష్యత్తు కార్యచరణ పై ప్రణాళిక సిద్ధం చేసి కమిటీలు, సభ్యత్వాలు, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు వేయాలని భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసేందుకు అడుగులు వేస్తున్నారని అలాగే వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మరియు అనేక సేవా కార్యక్రమాలు అభిమానులకు సూచనలు తెలిపారు… అలాగే గౌరవ అధ్యక్షులు బేతంచర్ల వెంకటేశ్వరరావు ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం సభ్యులు శాలువతో సన్మానించి  సత్కరించారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని సురేందర్ పటేల్ మాట్లాడుతూ అభిమాన సంఘాన్ని మరింత బలోపేతానికి కృషి చేయాలని అలాగే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కులమత విభేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, యుగంధర్, బండ్ల బాల, ఆటో బాలయ్య, డేరంగుల నరసింహ, పవన్ కళ్యాణ్, అభిమానులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *