కరకగూడెంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఉపాధిహామీ కార్మికులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

ఉపాధిహామీ కార్మికులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి.
ఉపాధి హామీ నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడదాం

కరకగూడెం,శోధన న్యూస్: ఉపాధి హామీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఉపాధి కార్మికులు వేసవి కాలంలో మండు వేసవి తట్టుకొని ఉపాధి హామీ పని చేస్తుంటే గతంలో మాదిరిగా వేసవి భత్యం, గడ్డపార, మంచినీరు లాంటి చార్జీలు మొత్తం చెల్లించేవారని ప్రస్తుతం వాటిని తీసేసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని నెలలకొద్దీ చేసిన పనికి బిల్లులు చెల్లించకుండా పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం చేస్తే కార్మికులు ఉపాధి హామీ పనికి రాకుండా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అవుతుందని వారు అన్నారు. ప్రతి బడ్జెట్లో ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ వస్తుందని పేద ప్రజల పొట్ట కొట్టేందుకే ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తుందని రెండు నెలలుగా ఉపాధి హామీ బిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఉపాధి కూలీలు డబ్బులు రాక కుటుంబాలు పోషించుకోలేక పిల్లలను చదివించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే చెల్లించాలని లేనియెడల ఉపాధి హామీ కార్మికులతో మండల కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఊకె నరసింహారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *