ప్రభుత్వ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
ప్రభుత్వ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
మణుగూరు, శోధన న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తెలంగాణ ఉద్యమకారుడు, మణుగూరు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .కేటీఆర్ కి చీర కట్టించి బస్ టికెట్ ఫ్రీ నా కాదా తెలుసుకోవాలని వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పెండ్లి చేసుకున్న చేసుకున్నబోయే ప్రతి ఆడపడుచులందరికీ తులం బంగారం ఇస్తే బాగుంటుందని, అప్పుడే ప్రజలు కాంగ్రెస్ మాటలను విశ్వసిస్తారని అన్నారు. మోసపూరితమైన 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజానికమే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. తెలంగాణ యావత్ ప్రజానీకం తెలంగాణ రాష్ట్ర ప్రధాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈ నెల 13 న జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో మహబూబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం, తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ కు 12 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.