లక్ష్మి పురం ప్రజలారా.. మీ రోడ్డును పట్టించుకునే నాదుడెవరో
లక్ష్మి పురం ప్రజలారా.. మీ రోడ్డును పట్టించుకునే నాదుడెవరో
-అంతా బురద మయం.
కరకగూడెం,శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బట్టుపల్లి ప్రధాన రోడ్డు నుంచి లక్ష్మీపురం గ్రామానికి వెళ్లే దారిలో చినుకు పడితే రోడ్డు చిత్తడి చిత్తడిగా ఏర్పడి ట్రాక్టర్ పెట్టి దున్నకుండా వరి నాట్లు వేయచ్చని లక్ష్మీపురం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపురం ప్రజలారా మీ రోడ్డు సమస్యను పట్టించుకునే నాధుడే కరువయ్యారా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారిన తమ భవిష్యత్తు మారడం లేదని రోడ్డు మీద నడవాలంటే అత్యంత భయం కరంగా ఉంటుందని బండి మీద జారి పడితే ప్రమాదం చోటు చేసుకుంటుందని. ప్రమాదం జరుగుతే ఎవరిని అడుగుతావు నీ ప్రమాదానికి బాధ్యులు ఎవరు అని లక్ష్మి పురం గ్రామస్తులు వాపోతున్నారు. లక్ష్మీపురం పెద్ద బ్రిడ్జి నుంచి ఊళ్లోకి గల ప్రధాన రహదారి బురద మాయమై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇంత జరుగుతున్న పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి బురద మయమైన రోడ్డును మరమ్మత్తులుగా గ్రావెల్ పోసి రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజల కోరుకుంటున్నారు.