ఎండ తీవ్రత గురి కాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలి
ఎండ తీవ్రత గురి కాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఎండ తీవ్రత గురి కాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్ని మండలాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండ తీవ్రత గురి కాకుండా ప్రజలు తగు రక్షణ చర్యలు పాటించాలని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందువల ఆసుపత్రుల్లో అత్యవసర మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో కూలీలు ఎండ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని. పని వేళలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉన్నందున వేసవిలో పాటించాల్సిన అంశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై కరపత్రాలను సిద్ధం చేయాలని చెప్పారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, జనసాంద్రత ఉన్న ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, హమాలీలు వడదెబ్బకు గురికాకుండా తగు చర్యలు చేపట్టాలని మంచినీరు అందించాలని షెడ్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 17వ తేదీన భద్రాచలంలో శ్రీరామనవమి ఉన్నందున భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆశ వర్కర్లకు ఏఎన్ఎం లకు వడ దెబ్బ తగిలినప్పుడు తీసుకోవలసిన ప్రథమ చికిత్స పై శిక్షణ తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వకూడదని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వడదెబ్బ కు సంబంధించి మరణాలు నమోదుకు విచారణకు మండల మెడికల్ ఆఫీసర్, తాసిల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ తో కూడిన కమిటీనిఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రోజు సంబంధిత నివేదికలు అందజేయాల్సిందేగా ఆదేశించారు. జ్యూస్ విక్రయ క్రంద్రాల వద్ద ఉపయోగించే ఐస్ నాణ్యతను తనిఖీ చేయాలని ఆహార భద్రత అధికారులను ఆదేశించారు. ప్రజలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేనప్పుడు ఒక లీటర్ నీటిలో నాలుగు స్పూన్ల పంచదార, అర స్పూన్ ఉప్పు కలిపి త్రాగడం ద్వారా ఓఆర్ఎస్ త్రాగిన ఫలితాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు.