ప్రజలు చలివేంద్రాన్ని వినియోగించుకోండి
ప్రజలు చలివేంద్రాన్ని వినియోగించుకోండి
-కరకగూడెం తహసిల్దార్ నాగ ప్రసాద్
కరకగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని మినరల్ వాటర్ ప్లాంట్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కరకగూడెం తహసిల్దార్ నాగప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఏ చిన్న అవసరమైన మండలానికి రావాల్సిందే .అవసరాల నిమిత్తం వచ్చే ప్రయాణికులకు దాహార్తి తీర్చే విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండే అందుకు ముఖ్య ఉద్దేశంతో ఎండాకాలంని దృష్టిలో పెట్టుకొని చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు, స్థానికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.