తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మేడారం జాతర ప్రత్యేక బస్సులను  ప్రజలు సద్వినియోగించుకోండి -పినపాక ఎమ్మెల్యే  పాయం  వెంకటేశ్వర్లు

మేడారం జాతర ప్రత్యేక బస్సులను  ప్రజలు సద్వినియోగించుకోండి

-పినపాక ఎమ్మెల్యే  పాయం  వెంకటేశ్వర్లు

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టిసి డిపో నుండి మేడారం  జాతర కు నడిపే ప్రత్యేక బస్సులను  ప్రజలు సద్వినియోగించుకోవాలని పినపాక ఎమ్మెల్యే  పాయం  వెంకటేశ్వర్లు కోరారు.  ఆదివారం మణుగూరు సురక్ష బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్య అతిదిగా హాజరైన  పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు  చేతుల మీదగా మేడారం స్పెషల్ బస్ ను  రిబ్బన్ కట్ చేసిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భారతదేశంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈనెల 21, 22, 23 తేదిలలో జరిగే జాతరకు భక్తుల రద్దీని దృష్టి లో  పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,మేడారం జాతరకు, మణుగూరు డిపో నుండి ౩౦ ఆర్టీసీ బస్సు  సర్వీస్ల ను  ఏర్పాటు చేసినన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని , మహిళలు ఉచిత  బస్సు,సర్వీసును వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం  బస్ డ్రైవర్స్ కి స్నాక్స్ అందజేశారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ బస్ డ్రైవర్లకు  మూడు రోజులు ఉచిత భోజనం అందజేయుచున్న లయన్స్ క్లబ్ వారిని అయన అభినందించారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ దిఎం స్వామి, ఆర్టీసీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,మహిళ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *